Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oka aasa undayyaa naa koorika theerchayyaa

ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా

Oka aasa undayyaa naa koorika theerchayyaa

Lyricist: Pastor Anand Babu
Verse
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య
యవనకాలమందు నీ కాడి మోయగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా
Verse
యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను ఆలకించవా –
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా
Verse
నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా
Verse
మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా

Related Tags

PrayerDevotionSupplication