Chorus
ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ఒక వరమడిగితిని ‖
Verse
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో‖ 2x ‖
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా‖ 2x ఒక వరమడిగితిని ‖
Verse
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా‖ 2x ‖
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని‖ 2x ఒక వరమడిగితిని ‖
Verse
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు‖ 2x ‖
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని‖ 2x ఒక వరమడిగితిని ‖
Verse
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు‖ 2x ‖
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని‖ 2x ఒక వరమడిగితిని ‖