Verse
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ‖ 2x ‖
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో‖ 2x ‖
Verse
తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో‖ 2x ‖
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .
Verse
దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి‖ 2x ‖
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
Verse
లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు‖ 2x ‖
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా