Verse
ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము
ఒకే పరిహారము
లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం‖ 2x ‖
విడువుము నీ మార్గం‖ ఒకే ఒక ‖
Verse
లోకం మాయరా – పాపం వీడరా‖ 2x ‖
నీ హృదయమెంతో బలహీనమంతా
పెడ దారి చూపురా‖ 2x ‖
పరికించి చూడుమా‖ ఒకే ఒక ‖
Verse
రక్తం చిందెరా – సిలువలో చూడరా‖ 2x ‖
నీ పాపములకు ప్రభు యేసు రక్తం
పరిహారమాయెరా‖ 2x ‖
క్షమ భిక్ష వేడరా‖ ఒకే ఒక ‖
Verse
సమయం లేదురా – సత్యమే సోదరా‖ 2x ‖
రారాజు త్వరలో రాబోవుచుండె
రక్షణను కోరుమా‖ 2x ‖
రయముగను చేరుమా‖ ఒకే ఒక ‖