Chorus
ఒక్క క్షణమైన
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే
24 గంటలు ఆరాధించాలే
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే
24 గంటలు అరెయ్ తీన్మార్ ఎయ్యాలే
Verse
వ్యర్ధమైన ఆలోచనలకు తావెందుకివ్వాలి
గంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలి
ఒక్క క్షణమైన‖ Okka kshanamaina ‖
ఒక్క క్షణమైన క్రీస్తుకు బయట నేనెందుకుండాలి
24 గంటలు క్రీస్తులో మండాలి
Verse
పనికిరాని విషయాలను నేనెందుకు చూడాలి
మహిమగలిగిన యేసుడే నా కనులలో నిండాలి
ఒక్క క్షణమైన‖ Okka kshanamaina ‖
ఒక్క క్షణమైన నేనెందుకు వ్యర్ధం చేయాలి
24 గంటలు గంతులు వేయాలి
Verse
మూర్ఖమైన మాటలు నాకు ఎందుకు రావాలి
అన్యభాషలతో నోరు నింపుకోవాలి
ఒక్క క్షణమైన‖ Okka kshanamaina ‖
ఒక్క క్షణమైన నేనెందుకు కూర్చుండిపోవాలి
24 గంటలు క్రీస్తుతో నడవాలి
Verse
చింతపడుటకు నా మనసే ఎందుకు వాడాలి
యేసు మాటలతో గుండెను నింపుకోవాలి
ఒక్క క్షణమైన‖ Okka kshanamaina ‖
ఒక్క క్షణమైన నేనెందుకు ధుఖఃంగుండాలి
24 గంటలు అరె పక పక నవ్వాలి
ఒక్క క్షణమైన‖ Okka kshanamaina ‖
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే
24 గంటలు ఆరాధించాలే