Verse
ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో‖ ఒక్క ‖
Verse
మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి‖ ఒక్క ‖
Verse
అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక‖ ఒక్క ‖
Verse
వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను‖ ఒక్క ‖
Verse
పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక‖ ఒక్క ‖
Verse
నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను‖ ఒక్క ‖
Verse
అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును‖ ఒక్క ‖