Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Okkate Aasa Jeevitha Abhilaasha

ఒక్కటే ఆశ జీవిత అభిలాష

Okkate Aasa Jeevitha Abhilaasha

Lyricist: Samuel Karmoji
Verse
ఒక్కటే ఆశ జీవిత అభిలాష
యేసునే రాజుగా కొలవాలని
నీ ప్రేమనే చూసా నీవే నా ద్యాస
పాడనా ఈ జీవితం నీదేనని
Chorus
అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని
ఆదియు నీవని అంతమే నీకు లేదని
ప్రతి నిత్యము కొనియాడాలని
Verse
నీ రూపమే నాకు ఇచ్చావని
ప్రతి శ్వాసలో నీవున్నావని
నీ దీపమే నాలో ఉంచావని
ఈ జీవితం కేవలం నీదేనని
అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని
ఆదియు నీవని అంతమే నీకు లేదని
ప్రతి నిత్యము కొనియాడాలని
కనుపాపలా నన్ను కాచావని
నీ చేతిలో నన్ను దాచావని
నా ప్రక్కనే నీడగ ఉన్నావని
నీ రెక్కలే నాకు ఆశ్రయమని
ప్రేమ రూపుడవు నీవని
నీ ప్రేమకే హద్దులేదని
మమతల మారాజని
నీదు కృప నాకు చాలని
ప్రతి నిత్యము కొనియాడాలని

Related Tags

WorshipSurrenderDevotion