Verse 1
ఒన్నెస్-2
Verse
దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము‖ 2x ‖
యేసయ్యా స్తోత్రముల్ – యేసయ్యా స్తోత్రముల్‖ 2x ‖
Verse
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను‖ 2x యేసయ్యా స్తోత్రముల్ ‖
Verse
దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా‖ 2x ‖
నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే‖ 2x ‖
ఆధారము ఆదరణ ఆయనలో‖ 2x ‖
Verse
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప‖ నడిపించు ‖
Verse
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము‖ నడిపించు ‖
Verse
యేసే నా పరి హారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో‖ 2x ‖
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
అన్ని నామములకన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము – సాతాను శక్తుల్ లయం లయము‖ 2x ‖
హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా…… ఆమేన్‖ 2x ‖
Verse
సాతాను పై అధికారమిచ్చును – శక్తి కలిగిన యేసు నామము‖ 2x ‖
శత్రు సమూహము పై జయమిచ్చును – జయశీలుడైన యేసు నామము‖ 2x ‖
Verse
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ‖ 2x ‖
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును‖ 2x ‖
Verse
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Verse
సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను‖ 2x ‖
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను‖ 2x ‖
Verse
నాదాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా‖ 2x ‖
నా కేడెము కోట నీవే‖ 2x ‖
నా రక్షణ దుర్గమా‖ నా ‖
Verse
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
Verse
మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే‖ రండి ‖
Verse
రాజాధి రాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను‖ 2x ‖
మనయేసు రాజు వచ్చును
పరిశుద్ధులన్ చేయ మనలన్‖ 2x ‖
ఆ… హా మన మచట కేగుదాం‖ 2x ‖
Verse
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో‖ 2x ‖
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్‖ 2x ‖
Verse
యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి – యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి‖ 2x ‖
Verse
యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్‖ 2x ‖
Verse
నూనెతో నా తలను
అభిషేకము చేయున్
నా హృదయము నిండి
పొర్లుచున్నది‖ 2x ‖
Verse
నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును‖ 2x ‖
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే‖ 2x ‖
Verse
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే‖ 2x ‖
||హల్లెలూయా||‖ హల్లెలూయా ‖
Verse
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట‖ 2x ‖
నా జీవిత ధన్యతై యున్నది‖ 2x ‖
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట‖ 2x ‖
నా జీవిత ధన్యతై యున్నది‖ 2x ‖
Verse
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా‖ 2x ‖
Verse
యేసుతో గడిపెద యేసుతో నడిచెద‖ 2x ‖
పరమును చేరగ నే వెళ్లెద‖ 2x ‖
హనోకు వలె సాగెదా
Verse
నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును‖ 2x ‖
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును‖ 2x ‖
||నేడో రేపో||‖ నేడో రేపో ‖
Verse
యేసు ప్రభువును బట్టి మా – స్తోత్రములు
అందుకొందువని స్తుతి – చేయుచున్నాము
దేవా నీవే – స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే – మహిమ రూపివి‖ 2x ‖
Verse
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు‖ 2x ‖
Verse
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా‖ 2x ‖
ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ‖ 2x ‖
Verse
మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు‖ 2x ‖
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ‖ 2x ‖
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్రభునికే నా యేసు ప్రభునికే
Verse
ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా‖ 4x ‖
నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా ఆరాధనా…