Verse 1
వారిలో ఒంటరియైన వాడు వెయ్యిమందియగును, ఎన్నిక లేనివాడు
బలమైన జనమగును..! - యెషయా 60 : 22
Chorus
పల్లవి : ఒంటరిని నేను ఒంటరిని
ఓడిపోయి నేను ఒంటరినై
ఓదార్పులేక ఓరిమిలేక
మరణమే ఇక శరణం అనుచు
అంతమవ్వాలని ఆశపడితి‖ ఒంటరిని ‖
Verse
దావీదు వలె నేను శ్రమలనొందుచు
నిందకు వేదనకు వేడుకనైతిని
ఒంటరినై నేను నిను వెదకుచుండగా
నీ వాక్యముచే నను ఆదరించి
ఇదిగో నేను ఉన్నాను అని నీవు
అభయము ఇచ్చితివి యేసు దేవా!‖ ఒంటరిని ‖
Verse
తప్పిపోయిన తనయుని వలె నేను
తండ్రికి దూరమై ఒంటరినైతిని
తప్పు తెలిసి క్షమీయించుమని
నీ చెంతకు నే చేరితి తండ్రి
నీవు నన్ను కౌగిలించి
క్షమియించిన ఓ కరుణామయుడా!‖ ఒంటరిని ‖
Verse
యాకోబు వలె నేను భయముతో వణకుచు
ఒంటరినై నీతో పోరాడుచుండగా
పేరు పెట్టి పిలిచినా దేవా
నీదు మోమును చూపించితివి
భయపడక నీవు సాగిపొమ్మని
దీవించితివి ఓ యేసు దేవా!‖ ఒంటరిని ‖