Verse
ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు‖ 2x ‖
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా‖ 2x ఒంటరివి ‖
Verse
వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా‖ 2x ‖
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు‖ 2x ఆలకించవా ‖
Verse
బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా‖ 2x ‖
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు‖ 2x ఆలకించవా ‖