Verse
ఓడ్డుచేరి నీ యెదుట
నిల్పునపుడు రక్షకా
ఒక్క యాత్మనైన తేక
సిగ్గుపడిపోదునా.‖ ఒక్క యాత్మనైన ‖
Chorus
ఒక్క యాత్మనైన నేను
రక్షింప యేసువా
వట్టి చేతులతో నిన్ను
దర్శించుట తగునా
Verse
ఆత్మలందు వాంఛలేక
సోమరులై కాలమున్
వ్యర్థపరచు వారానాడు
చింతతోడ నిల్తురు.
Verse
యేసువా! నా స్వరక్షణ
నిశ్చయంబు యైనదే
ఐనఫలితంబుజూడ
కష్టపడనైతినే.
Verse
కాలమెల్ల గడ్చిపోయెన్
మోసపోతినేనయ్యో
గడ్చినట్టి కాలమైతే
ఏడ్చినను రాదది.
Verse
భక్తులారా! ధైర్యంతోడ
లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసుయొద్ద
చేరునట్లు చేయుడి.