Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ooha Kandadayya Nee Karyamu

ఊహ కందదయ్యా నీ కార్యము

Ooha Kandadayya Nee Karyamu

Verse
ఊహ కందదయ్యా నీ కార్యము
ఊహకుమించిన నీ కార్యము
జరిగించుచున్నావు నా బ్రతుకున
కృపచూపుచున్నావు దిన దినమున
Verse
అర్హతేలేదంటూ ఉనికినే ప్రశ్నిస్తూ
పురుగులా నను చూస్తూ మనసునే వేదిస్తూ
గేళిచేసే వేళ చూసిన యేసయ్యా
ఆదరించావయ్యా ఆదరణ కర్తగా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము
Verse
భారమే బ్రతుకంటూ ఒంటరయ్యానంటూ
ఓడిపోయానంటూ ఓదార్పు లేదంటూ
కృంగియున్నవేళ చూసిన యేసయ్యా
తోడైనావయ్యా నా కన్న తండ్రిలా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము
Verse
పగవాని ఎదుటే నాకు- క్రొవ్విన మాంసమునిచ్చి
కన్నీరు తుడిచి- తలగా నను చేసావంటూ
నాట్యమాడే వేళ చూసిన యేసయ్య
స్థిరపరిచావయ్యా నీ మహిమ పాత్రగా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము

Related Tags

WorshipGraceMiracles