Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohakandananta Vunnatam Naapatla

ఊహకందనంత ఉన్నతం నాపట్ల

Oohakandananta Vunnatam Naapatla

Verse
ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
Chorus
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది
Verse
జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది
Verse
దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది
Verse
కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది

Related Tags

GraceLoveGod