Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohaku Andani Kaaryamul

ఊహకు అందని కార్యముల్

Oohaku Andani Kaaryamul

Chorus
ఊహకు అందని కార్యముల్
ఊహించని రీతిలో నాకై చేసిన దేవా
ఊహకు అందని వేళలో
ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
నీదు నామ గీతము నాదు జీవితాంతము
కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్‖ ఊహకు ‖
Verse
కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్‖ 2x ‖
Verse
అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు‖ 2x ఉత్సహించి ‖
Verse
బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు‖ 2x ఉత్సహించి ‖

Related Tags

PraiseWorshipMiracles