Verse
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా
వెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమా
తరలెన్ని మారిన యుగాలెన్ని గడచినా
జగానా మారనిది యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ
ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా‖ 2x ‖
Verse
మనిషిని మనిషిని ప్రేమించుటకు స్వార్ధం మూలకారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం‖ 2x ‖
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు‖ 2x ‖
Verse
జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం‖ 2x ‖
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం‖ 2x ‖