Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohinchalenayya Vivarinchalenayya

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

Oohinchalenayya Vivarinchalenayya

Verse
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను‖ 2x ‖
నా జీవితాంతం ఆ ప్రేమలోనే‖ 2x ‖
తరియించు వరమే దొరికెను‖ 2x ఊహించ ‖
Verse
నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను‖ 2x ‖
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను‖ 2x ఊహించ ‖
Verse
నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను‖ 2x ‖
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము‖ 2x ఊహించ ‖

Related Tags

PraiseWorshipGods Love