Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohinchaleni Kaaryamulu

ఊహించలేని కార్యములు

Oohinchaleni Kaaryamulu

Verse
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు‖ 2x ‖
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము‖ ఊహించలేని ‖
Verse
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం‖ 2x ‖
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై‖ 2x ‖
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ‖ ఊహించలేని ‖
Verse
దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో‖ 2x ‖
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు‖ 2x ‖
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి‖ ఊహించలేని ‖

Related Tags

BlessingMarriageWedding