Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohinchani Kaaryamulu Choochedhanu

ఊహించని కార్యములు చూచెదను

Oohinchani Kaaryamulu Choochedhanu

Lyricist: Pastor Vinod Kumar
Verse
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
నా యేసు నాపై చేయుచున్నాడు
చేయుచున్నాడు చేయుచున్నాడు
అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు
Verse
ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా
ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా
ఏ సమయమందైనను చింత లేదుగా
విస్తారమయిన కృప ఉండగా
కృప ఉండగా కృప ఉండగా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
Verse
ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా
నీ ప్రేమను చూప భువికి వచ్చినావయా
నా పాపమంత సిలువలో మోసినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
ఇచ్చినావయా ఇచ్చినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
Verse
ఏలుచున్నాను ఏలుచున్నాను
విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను
ఏలుచున్నాను ఏలుచున్నాను
నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను

Related Tags

FaithGraceHope