Verse
ఊరుకో హృదయమా - నీలో మత్సరమా
దేవునివైపు చూడుమా - ఆ చూపులో శాంతి గ్రోలుమా
Verse
దుర్జనులను చూచి కలవరమేల
దుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేల
నమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు
తగినకాలములో నిను హెచ్చించును చూడు
Verse
విశ్రమించు ఆయన ఒడిలో హాయుగా
ధైర్యము వీడక కనిపెట్టు ఆశగా
ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి
కలిగించు సహనము తొలగించు బ్రాంతి