Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ooruko Naa Praanamaa

ఊరుకో నా ప్రాణమా

Ooruko Naa Praanamaa

Lyricist: Dr Asher Andrew
Verse
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా‖ 2x ‖
Verse
ఎడారి దారిలోన‌‌‌ – కన్నీటి లోయలోన‖ 2x ‖
నా పక్ష‌మందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
Verse
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా‖ 2x ‖
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా‖ 2x ఊరుకో ‖
Verse
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా‖ 2x ‖
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట అసంభవమేగా‖ 2x ఊరుకో ‖
Verse
అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా‖ 2x ‖
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా‖ 2x ఊరుకో ‖

Related Tags

WorshipComfortHope