Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Opaapee Sandhinchithivaa Nee Paapa Vimoachakuni

ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకుని

Opaapee Sandhinchithivaa Nee Paapa Vimoachakuni

Verse
ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని
నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్
Verse
బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను
నిందను పొందెను - పొంద నీ వానందము
Verse
క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో
వాత్సల్యముతో - నిన్నానందింపజేయ
Verse
రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ
శిక్షను బొందె - నిన్నానందింపజేయ
Verse
ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
అబ్బును శాంతి - తెరచిన హృదయమున్
Verse
జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము
Verse
రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును అణచివేసి
దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు
Verse
దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు
సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి

Related Tags

InvitationGospelSalvation