Verse
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా‖ ఓరన్న ‖
Verse
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా‖ 2x ‖
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును‖ 2x ఓరన్న ‖
Verse
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా‖ 2x ‖
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను‖ 2x ఓరన్న ‖
Verse
సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న‖ 2x ‖
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును‖ 2x ఓరన్న ‖