Verse
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు
Chorus
ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు‖ 2x ‖
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు‖ 2x ఓడిపోనివ్వడు ‖
Verse
పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా‖ 2x ‖
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము‖ 2x ‖
సీయోనులో మన స్థానము సుస్థిరము‖ 2x ఓడిపోనివ్వడు ‖
Verse
నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా‖ 2x ‖
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము‖ 2x ‖
Verse
దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు‖ 2x ‖
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు‖ 2x ఓడిపోనివ్వడు ‖