Verse
పాడనా స్తోత్ర కీర్తన పాడనా హృదయాలపన
కలువరిలోనా కరుణమయుని
పయణమును పాడనా
వేదన విలపించిన…
ప్రేమమయుడా కలువరినాధా
నీ గాయములు వర్ణించుట నా తరమౌనా…
Verse
పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసి
ముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా..
బాధతో నా ప్రభువు కుమిలిపోయేనే
మనకై వేదన సహియించేనే
కరుణామయూడా కృపగల దేవా
నీ యోగ్యత వర్ణించుట నా తరమౌనా…..
Verse
గాలాలతోనే అల్లిన కొరడా ప్రభు దేహము చేల్చెను
నీ దివ్య రూపం చిదిమింది నేనే
నా అంధకారం మోసింది నీవే
పారింది రుధిరo ఈ లోక రక్షణకై .
నే మోస్తూ బ్రతికేది నీ వార్త భారం
సిలువ దారుడా వాక్యనాథుడ
నీ నెరవేర్పు వర్ణించుట నా తరమౌనా ….