Verse
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు‖ 2x ‖
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే‖ 2x పాడనా ‖
Verse
ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును‖ 2x ‖
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే‖ 2x పాడనా ‖
Verse
దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు‖ 2x ‖
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే‖ 2x పాడనా ‖
Verse
నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును‖ 2x ‖
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే‖ 2x పాడనా ‖