Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paadeda Deva Nee Krupalan Nootana Geethamulan Sthotramu Chellinthun

పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్

Paadeda Deva Nee Krupalan Nootana Geethamulan Sthotramu Chellinthun

Chorus
పాడెద దేవా - నీ కృపలన్
నూతన గీతములన్ - స్తోత్రము చెల్లింతున్
స్తుతి స్తోత్రము చెల్లింతున్‖ 2x ‖
Verse
భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి‖ 2x ‖
ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి
Verse
ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
Verse
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి
Verse
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
Verse
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి
సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి
Verse
అన్యుడనై నిన్ను ఎరుగక యున్నాను ధన్యుని చేసితివి
ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి

Related Tags

PraiseThanksgivingGrace