Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paadeda Devaa Nee Krupalan

పాడెద దేవా నీ కృపలన్

Paadeda Devaa Nee Krupalan

Lyricist: Songs Of Zion
Verse
పాడెద దేవా – నీ కృపలన్
నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్‖ 2x ‖
Verse
భూమి పునాదులు వేయకముందే
యేసులో చేసితివి‖ 2x ‖
ప్రేమ పునాదులు వేసితివి
దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి‖ 2x పాడెద ‖
Verse
ప్రవిమల రక్తము కలువరి సిలువలో
కలునకు నిచ్చితివి‖ 2x ‖
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి‖ 2x పాడెద ‖
Verse
పాపము శాపము నరకపు వేదన
మరి తొలగించితివి‖ 2x ‖
అపరాధములచే చచ్చిన నన్ను
ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి‖ 2x పాడెద ‖
Verse
దేవుని రాజ్యపు వారసుడనుగా
క్రీస్తులో చేసితివి‖ 2x ‖
చీకటి రాజ్యపు శక్తుల నుండి
నను విడిపించితివి – చెర నను విడిపించితివి‖ 2x పాడెద ‖
Verse
ముద్రించితివి శుద్ధాత్మతో నను
భద్రము చేసితివి‖ 2x ‖
సత్యస్వరూప నిత్యనివాసి
సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి‖ 2x పాడెద ‖
Verse
అన్యుడనై నిను ఎరుగక యున్నను
ధన్యుని చేసితివి‖ 2x ‖
ప్రియ పట్టణ పౌరుల సేవింపను
వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి‖ 2x పాడెద ‖

Related Tags

PraiseWorshipGrace