Verse
పల్లవి: పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా
నిన్ను మేము పూజించెదము శ్రద్ధభక్తితో
Verse
ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి
ధనవంతులుగ మమ్ము జేయ పేదవైతివి
Verse
దేవుని స్వరూపమైయుండి యెంచలేదు సమానుడని
రిక్తుడై నిందను భరించి దాసుడైతివి
Verse
పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగనైతివినిల
నీతి న్యాయములు గలిగి జయించితివి
Verse
పాపమెరుగని వాడవు కపటమేమి లేదు నీ నోట
ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు
Verse
నీచుడుగా నీ వెంచబడి తృణీకరింప బడితివి
వ్యాధి బాధ వేదన పొంది సహించితివి
Verse
గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా
నలుగ గొట్టబడిన నీవు మరణమైతివి
Verse
పరాక్రమ శాలివై ప్రభు సజీవుడవై లేచితివి
మరణమును జయించితివి విజయుండవై