Chorus
పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్‖ 2x ‖
ఆ..ఆ..ఆ...‖ 2x ‖
Verse
భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి
ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి
ఈ దీనుని బ్రోచితివి‖ పా ‖
Verse
ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి
ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
నా పాపము తుడిచితివి‖ పా ‖
Verse
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి
నన్ను బ్రతికించితివి‖ పా ‖
Verse
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
చెరవిడిపించితివి‖ పా ‖
Verse
ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి
సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి
నీ సొత్తుగా చేసితివి‖ పా ‖
Verse
అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి
ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
కృప వరముల నొసగితివి‖ పా ‖