Verse
పాడెదా పాడెదా పాడెద యేసయ్యా
నీ నామ గానము నే చేసెద యేసయ్యా
నా హృదయ స్పందన తకదిమి తాళమై
నా కంఠధ్వని మధురశ్రావ్యమై
నా శ్వాసము సరిగమ నాదమై
నీవు చేసిన మేళుల మరువక
నా దోషముల క్షమించిన వాడవని
సంకటముల కుదుర్చిన వాడవని
మరణము నుండి కాపాడితివని
నా నేరములకు శిక్ష విధించక
అతిక్రమ క్రియలకు ప్రతిఫలమివ్వక
ఎన్నడు కలువని భూదిశలవలే
అపరాధముల దూరపరచితివని