Verse
పాడెద స్తుతిగానము – కొనియాడెద నీ నామము
నీవే నా ప్రేమానురాగం – క్షణమైన విడువని స్నేహం
అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా
Verse
ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నీ అనుబంధము నాకానందమే
Verse
నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీ రుధిరదారలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను
నీ అభిషేకము పరమానందమే
Verse
బలహీనతలో నను బలపరచి దైర్యము నింపితివే
నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి
యూదాగోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహాసమే
నీ పరిచర్యలో మహిమానందమే