Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paadudhunu Kreesthu Paera Padhamu Nem

పాడుదును క్రీస్తు పేర పదము నెం

Paadudhunu Kreesthu Paera Padhamu Nem

Lyricist: Allari Pedaveeraswamy
Chorus
పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ
జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా
డిహ లేఁడు లేఁడందు నహహా‖ పాడుదును ‖
Verse
పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు
గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి
చక్కికిఁ జేర్చి ప్రోచె‖ పాడుదును ‖
Verse
మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు
రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము
లేదనుస్వామి‖ పాడుదును ‖
Verse
పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా
రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు
మాని యాయనే జయంజయమని‖ పాడుదును ‖
Verse
చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి
యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి
నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన‖ పాడుదును ‖
Verse
ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను
కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని
శరణం నాశరణమని‖ పాడుదును ‖

Related Tags

PraiseWorshipDevotional