Chorus
పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో
పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో‖ పాహిలోక ప్రభో ‖
Verse
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని
చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో‖ సత్ర్పభో ‖
Verse
నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
దేవ లోకాధిపతులు దూతల సమూహము
దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో‖ ప్రభో ‖
Verse
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
పరలోక సేనాధిపతివైన మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ
మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో‖ ప్రభో ‖
Verse
కెరూబులను దూతలు సెరూపులను దూతలు
తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
నీ దపొస్తలుల మహిమగల సంఘము
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము
సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో‖ మా ప్రభో ‖
Verse
నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును
నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్
Verse
ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని
నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో‖ ప్రభో ‖