Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapa Pashchaaththaapa Momdani Vaariki Pa

పాప పశ్చాత్తాప మొందని వారికి ప

Paapa Pashchaaththaapa Momdani Vaariki Pa

Lyricist: Vi Venkataswami
Chorus
పాప పశ్చాత్తాప మొందని వారికి పరమ భాగ్య మేడ నబ్బునే మనసా
పాపాత్ములకు యేసు పరమండలము నుండి భూమధ్యమునకుఁ దా
వచ్చెను పాపిష్ఠుల రమ్మని పిలిచెను నా ప్రాపుఁ గోరుమని చెప్పెను
మనసా‖ పాప ‖
Verse
ధైర్యమొంది నన్ను దలఁచిన వారికి పూర్వజ్ఞాన మొనఁగూర్తును దు
ర్భావ మెల్లను విడఁ దీతును యేసు వారి యాజ్ఞ యని యనియెను
మనసా‖ పాప ‖
Verse
బలపడి నాదు నామము గొన్నవారికి యిల బాంధవుల వైరమందును
సర్వ కుల జనంబుల క్రోధమందును స్నేహి తుల యెడ బాటులు
గల్గును మనసా‖ పాప ‖
Verse
అడిగిన వారికి నొసఁగుదు ననుచును కడుమోదమున నాజ్ఞాపించెను
తట్టు తట్టుఁడని బోధించెను విప్పి విడబడునని ప్రేమించెను మనసా
||పాప||‖ పాప ‖
Verse
దోషములన్నియు యేసు నాధుడు తా మోసికొని సమ్మతించెను సిలువ
వేసిన వారిని దీవించెను మోక్ష వాస సాధన మని తెల్పెను మనసా
||పాప||‖ పాప ‖

Related Tags

GraceRepentanceSalvation