Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapabhaaramu Dhushtaguna Samaethumdanai Duhkhanashta Dhaurjanyamuthoa Numda

పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ

Paapabhaaramu Dhushtaguna Samaethumdanai Duhkhanashta Dhaurjanyamuthoa Numda

Verse
పాపభారము దుష్టగుణ సమేతుండనై
దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ
చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా
రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి
Chorus
సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున
భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను
కనుగొంటి సిల్వలో రక్షణ
Verse
ఏగుచుందు నిత్యము జీవమును బొందను
సిల్వలో కృపశక్తి పొందుదున్
శోధనలు వచ్చిన జయ మొందుచుందును
మోకరించి ప్రార్థింతు సిల్వచెంత
Verse
జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల
ఆత్మసాయముచే సిల్వజూతును
యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా
భారముల మోయుశక్తి పొందుదున్
Verse
భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము
యేసు రక్తమందు నిన్ను కడుగును
నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో
క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును

Related Tags

RepentanceSalvationCross