Chorus
పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు
పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని
భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ‖ పాప ‖
Verse
పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు
నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము
లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు‖ పాప ‖
Verse
కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు
ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు
వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను‖ పాప ‖
Verse
పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే
పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య
లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె‖ పాప ‖
Verse
పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ
పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని
స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు‖ పాప ‖
Verse
పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని
దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి
కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే‖ పాప ‖
Verse
శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు
వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు
నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె‖ పాప ‖