Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapal Hosannaa Paatal Paadina Reetha

పాపల్ హోసన్నా పాటల్ పాడిన రీత

Paapal Hosannaa Paatal Paadina Reetha

Lyricist: Theodulph Orleans
Verse
పాపల్ హోసన్నా పాటల్
పాడిన రీతిగన్
నృపాలస్తుతి కీర్తుల్
నీకుఁ జెల్లింతుము
దావీదు పుత్రకుండా
యిశ్రాయేల్ పాలకా
దేవుని పేర వచ్చు
ధీరుండా ధన్యాత్మ.
Verse
దూత లాకాశమందు
దొడ్డగఁ గొల్తురు
భూతలమందు సృష్టి
పూజించును నిన్ను
హెబ్రీయుల్ ఖర్జూరంపు
శాఖల్ చేఁబూనుచు
హెచ్చించి మొక్కినట్లు
నిను స్తోత్రింతుము.
Verse
నీ శ్రమలకు ముందు,
నిన్ గౌరవించిరి
నీ జయమొందువెన్న
మా కీర్తన స్తుతి
అవ్వారి స్తుతుల్ నీవు
అంగీకరించితి
మా కీర్తంబుగూడ
మన్నన జేయుమీ.

Related Tags

PraiseWorshipHosanna