Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapame Aahaaramugaa

పాపమే ఆహారముగా

Paapame Aahaaramugaa

Lyricist: Stephen Bob
Intro
పాపమే ఆహారముగా
అన్యాయమే అలవాటుగా
తరతరాలుగా నశిస్తున్న ఈ నాశన పుత్రులను
రక్షించడానికి రగిలిన రణమే క్రీస్తు ప్రభంజనం
Chorus
చీకట్లను చీల్చిన నీతి సూర్యుడు
పాపాన్ని తరిమి కొట్టిన విప్లవ వీరుడు
మృత్యువుని మట్టి కరిపిన సమరయోధుడు
దహించు జ్వాలల ప్రకాశించిన తేజోమయుడు
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు
రగిలే అన్యాయమును చల్లార్చి
ఎగిసే దోషమును పరిహరించి
కఠినమైన మనసును విరిచివేసి
రక్షణ ఆనందమును అనుగ్రహించి
శిక్ష నుంచి విడిపించిన బలశూరుడు నీవే
బలశూరుడు నీవే‖ 2x ‖
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు
మాకై నిలిచిన బాహుబలం నీవే
జగతికి దొరికిన ఓ చక్కని వరం నీవే
పాపపు అస్త్రం చీల్చిన శౌర్యుడు నీవే
మా కన్నీళ్లు తుడచిన రక్షకుడవు నీవే
జగ మేలుతున్న రారాజు నీవే
రారాజు నీవే‖ 2x ‖
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు

Related Tags

GospelSalvationJesus Christ