Verse
పాపమెరుగని పావనాత్ముని
పరిహసించుట న్యాయమా‖ 2x ‖
దోషమెరుగని దీన బాంధుని‖ 2x ‖
దోషి చేయుట ధర్మమా – ధర్మమా‖ పాపమెరుగని ‖
Verse
మోయరాని పాప భారము
మోపినారు సిలువపై‖ 2x ‖
గాయమొంది బాధకోర్చి వేదననొంది
ప్రాణమిచ్చుట నేరమా‖ 2x ‖
నేరమా‖ పాపమెరుగని ‖
Verse
జీవ జలముల త్రోవ చూపి
బ్రోవ నాత్మల దాహమొందె‖ 2x ‖
చావొంది ఆగమై బలి దానమై
జీవమిచ్చుట ఘోరమా‖ 2x ‖
ఘోరమా‖ పాపమెరుగని ‖