Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapamu Dalanchu Sumee Pashcha Ttaapamu

పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపము

Paapamu Dalanchu Sumee Pashcha Ttaapamu

Lyricist: Yeshaya Veeramartin
Chorus
పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని
యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ‖ పాపము ‖
Verse
పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక
పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ‖ పాపము ‖
Verse
గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ
గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ‖ పాపము ‖
Verse
ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు
క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ‖ పాపము ‖
Verse
తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు
ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ‖ పాపము ‖
Verse
అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ
డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ‖ పాపము ‖

Related Tags

PrayerRepentanceSalvation