Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapamu valana chedinavaani premathoa

పాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో

Paapamu valana chedinavaani premathoa

Lyricist: Frances Jane Van Alstyne
Verse
పాపము వలనఁ చెడినవానిఁ
ప్రేమతో వెతకి రక్షించుఁడు
తప్పినవానిని ద్రోహిని మీరు
యేసుని యొద్దకు రమ్మనుఁడు.
Chorus
పడినవారికిఁ జూపుఁడు త్రోవ‖ పడినవారికిఁ జూపుఁడు త్రోవ ‖
యేసు పాపాత్ములన్ రక్షిం
చును‖ చును ‖
Verse
నీతిని కోరక యల్లాడువాని
యేసు రక్షించుటకై కాచును
ప్రేమతో వారినిఁ బిలుచుకొండి
యేసును నమ్మిన రక్షించును.
Verse
పాపవిషంబు మనస్సున దాగి
గుణము పూర్తిగఁ జెఱిపినన్
యేసుని ప్రేమ యనుకిరణంబు
దాని గుదుర్చును పూర్ణముగా.
Verse
చెడినవారిని రక్షింపఁ బొండి
యేసుఁడు శక్తిని మీ కీయఁగా
మోక్ష మార్గంబునడిపించుండి
వారిని రక్షింప యేసు వచ్చెన్

Related Tags

SalvationEvangelism