Chorus
పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే
Verse
ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు
నీవే‖ పాపి ‖
Verse
అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే
యేసు నీవే‖ పాపి ‖
Verse
చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే‖ పాపి ‖
Verse
రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను
నీవే యేసు నీవే‖ పాపి ‖
Verse
నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు
నీవే యేసు నీవే‖ పాపి ‖
Verse
శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు
నీవే యేసు నీవే‖ పాపి ‖
Verse
భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము
నీవే యేసు నీవే‖ పాపి ‖