Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapinayyaa Nea Baapi Nayyaa Kaapaada

పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ

Paapinayyaa Nea Baapi Nayyaa Kaapaada

Lyricist: Bethala John
Verse
పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము
నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా‖ పాపి ‖
Verse
కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన
యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా‖ పాపి ‖
Verse
ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను
ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావు‖ పాపి ‖
Verse
ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ
గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా‖ పాపి ‖
Verse
మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని
న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ‖ పాపి ‖
Verse
శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత
మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత
నునుచు‖ పాపి ‖

Related Tags

PrayerRepentanceConfession