Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapini Krupa Joopavayyaa Daapu Jeritha

పాపిని కృప జూపవయ్యా దాపు జేరిత

Paapini Krupa Joopavayyaa Daapu Jeritha

Lyricist: Siripurapu Krupanandamu
Chorus
పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము
క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా‖ పాపి ‖
Verse
వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను
చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా‖ పాపి ‖
Verse
నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు
మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా‖ పాపి ‖
Verse
నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష
మంత బాపి కనికరింపు మా యేసయ్యా‖ పాపి ‖
Verse
నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల
జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా‖ పాపి ‖
Verse
దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి
నిత్య జీవమిడవయ్యా యేసయ్యా‖ పాపి ‖
Verse
శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు
శాంతి నొసగెదవు యేసయ్యా‖ పాపి ‖
Verse
పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన
మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా‖ పాపి ‖
Verse
నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ
హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా‖ పాపి ‖

Related Tags

GracePrayerRepentance