Verse
ప్రభువా నన్ను రక్షింపుము మత్తయి Matthew 14:31
Chorus
పాపిని నేను తప్పితి – భువిలో రక్షించెడి వారెవరు
ఓ ప్రభు యేసు నిరీక్షణతో – నీ దరికి జేరితిని
Verse
ప్రభువా పాపిని రక్షించుటకు – ఈ భువి కరుదెంచితివి
దౌర్భాగ్యుడను వేడితి శరణం – వేరేమి చేయలేను
Verse
జీవము నివ్వ వచ్చితివి – చచ్చి యుంటి నేను
బంధింపబడితిని మరణ బంధముతో – విడిపించెడి వారెవరు
Verse
జన్మముతోనే అపవిత్రుడను – నా స్వభావమే పాపం
క్రియలలోను మాటలయందు – నీకు విరోధినైతిని
Verse
స్వంత నీతితో నిండిన పనులు – మరి పుణ్య కార్యములు
ఆచారములతో చిక్కుకొన్నాను – తప్పించెడి వారెవరు
Verse
భరియించితివి పాపపు శిక్ష – ప్రాణమిచ్చితివి నాకై
రక్తము కార్చి సర్వమిచ్చితివి – నన్ను రక్షించుటకై
Verse
ఓ ప్రభు యేసు దయాళుడ వీవు – కృంగివచ్చుచున్నాను
నా పాపములు క్షమియించు ప్రభువా – గొప్ప రక్షణకర్త వీవే