Chorus
పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల
మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా‖ పాపిని ‖
Verse
నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా
ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా‖ పాపిని ‖
Verse
జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా
నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా‖ పాపిని ‖
Verse
మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ
గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా‖ పాపిని ‖
Verse
మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా
మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా‖ పాపిని ‖
Verse
మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా
తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా‖ పాపిని ‖