Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapula Rakshakudu Yaesu Goppa Dhevaadhi Dhaevudu Yaesu

పాపుల రక్షకుడు యేసు గొప్ప దేవాది దేవుడు యేసు

Paapula Rakshakudu Yaesu Goppa Dhevaadhi Dhaevudu Yaesu

Verse
పాపుల రక్షకుడు యేసు
గొప్ప దేవాది దేవుడు యేసు
కృపతో కౌగలించె నను యేసు
ఉపకారి నన్ను చేర్చె యేసు
Chorus
సర్వంబులో నాకు సర్వమేసు
సర్వశక్తిగల యేసు హల్లెలూయ ఆమెన్
Verse
గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు
దొరుకు తన్ను వెదకు వారి కేసు
ఆరాధికులకు పరిశుద్ధుడేసు
నిరాశగలవారి మిత్రుడేసు
Verse
నాదు మార్గంబునకు వెలుగు యేసు
నాదు పాదంబులకు దీపము యేసు
నాదు దాహంబునకు పానము యేసు
నాదు యజ్ఞానంబునకు జ్ఞానము యేసు
Verse
నాదు రోగంబులకు వైద్యుడు యేసు
నాదు బాధ్యతల వహించు నేసు
నాదు ఏకాంతములో తోడు యేసు
నాకు తేనె కంటె బహు తీపి యేసు
Verse
నాకు రక్షకుడు రక్షణ యేసు
నాకు విమోచకుడు విమోచ నేసు
నాకు జీవంబును దేవుడు యేసు
నాకు నీతి నాదు వెలుగు యేసు
Verse
నాకు మాదిరి వెంబడించ యేసు
నాకు ముందు నడచు నాయకుడేసు
నాకు దుఃఖంబులో ఆదరణేసు
నాదు కష్టంబులో ధైర్యము యేసు
Verse
నాదు హృదయంబున యున్నవాడు యేసు
నాదు వృద్ధికి కారకుండు యేసు
నాదు కృంగుదలలో తోడనుండు యేసు
నాదు సర్వమందు నిల సర్వమేసు

Related Tags

WorshipSalvationJesus