Intro
పాపులకొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయెను
పాపికి రక్షణనిచ్చెను - పావన రక్తము కార్చి
Verse
దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా?
మునిగెదవేల ఎన్నడు పాపములో?
దాచిన నీవు నీ పాపమును ప్రియుడా
నిత్య జీవమును ఏలాగు పొందెదవు?
Verse
పాపభారము క్రింద పడియున్న ప్రియుడా
ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై
నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా
యిదియే యేసుని వాగ్దానము నమ్ము
Verse
నరక మార్గము విశాలము ప్రియుడా
జీవమునకు పోవుమార్గము ఇరుకు
ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా
పరము చేరుదువు యేసుని ద్వారానే
Verse
ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా
పాప దుహ్ఖముతో నిండియున్నది
దీనుడైన నీవు శుద్ధిని కోరుము ప్రియుడా
దొరుకును రక్షణ ఈ క్షణమే