Chorus
పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు
సఖుండు‖ పాపులకు ‖
Verse
రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ
మన కుండు యేసుండని‖ పాపులకు ‖
Verse
దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన
విహీనుల సాహాయ్యము నోహో యని‖ పాపులకు ‖
Verse
ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే
మయ్య మన మయ్య దుర్నయ్యముల్‖ పాపులకు ‖
Verse
నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు
న ఖండ పురుషుండని‖ పాపులకు ‖
Verse
నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ
నిందలో నుందు రానందమున‖ పాపులకు ‖