Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paata Paadaala Vaadyamulu Mraagaala

పాట పాడాలా వాద్యములు మ్రాగాల

Paata Paadaala Vaadyamulu Mraagaala

Lyricist: A R Stevenson
Verse
పాట పాడాలా వాద్యములు మ్రాగాల
వేడుకలు చేసుకోవాలా
అందరూ ఒక్కటై ఉత్సహించాల
రాజుల రాజునకు భజన చేయాలా
కారణ జన్మునికి మహిమ చెందాల
Verse
పొందిన మేళ్లను మరుగు చేయక
అందరి ముందర సాక్ష్యమివ్వాలా
మానవుని ప్రేమించి నాశనము తప్పించే
రక్షకుని స్వంతమవ్వాలా
Verse
దేనిని గూర్చియు దిగులు చెందక
భారము యేసుకు అప్పగించాల
ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే
భీకరుని ఆశ్రయించాలా
Verse
లోకము వైపుకు కనులు త్రిప్పక
దేవుని నీతిపై దృష్టి ఉంచాలా
వాక్యముతో సంధించి క్షేమముతో పంపించే
శ్రీకరుని సన్నుతించాల

Related Tags

PraiseWorshipThanksgiving